Header Ads Widget

Ticker

6/recent/ticker-posts

గోవిందుడు బాక్సాఫీస్‌తో ఆడేసుకుంటున్నాడు

గత బుధవారం ఆగష్టు 15న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా విడుదలైన గీత గోవిందం సినిమా కళ్ళు చెదిరే కలెక్షన్లతో థియేటర్స్ లో దూసుకుపోతుంది. వీక్ మిడిల్ లో విడుదలైనా ఈ సినిమాకి సూపర్ హిట్ టాక్ వస్తే ఒకే కానీ... తేడాగా టాక్ వచ్చిందా సినిమా పని అవుట్ అంటూ అన్నప్పటికీ... సినిమా టాక్ సూపర్ హిట్ టాక్ గా రావడంతో.. గురువారం కూడా షోస్ ఫుల్ అవడం.. అటల్ బిహారి వాజ్ పాయ్ మరణంతో శుక్రవారం సెలవు రావడంతో.. శని ఆదివారాల్లో గీత గోవిందం కలెక్షన్స్ కుమ్ముడే కుమ్ముడు అన్నట్టుగా ఒక రేంజ్ లో కొల్లగొట్టింది. ఐదు రోజుల్లోనే గీత గోవిందం కలెక్షన్స్ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ 21 కోట్ల 47 లక్షలు కొల్లగొట్టడం.. ప్రపంచ వ్యాప్తంగా 31 కోట్ల 67 లక్షలు కొల్లగొట్టి చిన్న సినిమా చితక్కొట్టే కలెక్షన్స్ వసూళ్లు సాధించిందంటూ గీత గోవిందం సినిమాపై భారీ క్రేజ్ రావడంతో సినిమాకి మరింతగా క్రేజ్ పెరిగిపోయింది. ఇక గీత గోవిందం సక్సెస్ సెలెబ్రేషన్స్ కి మెగాస్టార్ చిరు రావడం.. సినిమాకి మరింత బూస్ట్ ఇవ్వడం.. ఇండస్ట్రీలోని పలువు ప్రముఖులు గీత గోవిందం సినిమా చూసి ఎంజాయ్ చెయ్యడమే కాదు.. ఆ సినిమాకి పాజిటివ్ ఫీడ్ బ్యాక్ సోషల్ మీడియాలో ఇవ్వడం అన్ని అంటే అన్ని ఈ సినిమాకి కలిసొచ్చాయి.

అందుకే సోమవారం కూడా గీత గోవిందం థియేటర్స్ హౌస్ ఫుల్ తో కళకళలాడాయి. వీక్ డే రోజున కూడా గీత గోవిందం కలెక్షన్స్ స్టడీగా ఉన్నాయంటే.. సినిమాలో ఎంతగా కంటెంట్ ఉందో.. విజయ్ దేవరకొండ సుడి ఎలా ఉందో అర్ధమవుతుంది. నిజంగా గోవింద్ గా విజయ్, గీత గా రష్మికల నటనకు ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవడంతోనే రిపీటెడ్ ఆడియన్స్ ఈ సినిమాకి ఉంటున్నారు కాబట్టే.. ఈ రేంజ్ కలెక్షన్స్ గీత గోవిందం కొల్లగొడుతుంది. మరి ఈ రేంజ్ వర్షాలు అంటే.. భారీ తుఫాన్... రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఎడతెరపి లేని వర్షాలతో అతలాకుతలం అవుతున్న టైం లోను విజయ్ దేవరకొండ సినిమా గీత గోవిందం మంచి కాదు కాదు అదరగొట్టే కలెక్షన్స్ సాధించడం మాత్రం సూపర్ అంతే. ఇక విజయ్ దేవరకొండ అదృష్టం ఎలా ఉందో తెలుసా.. రేపు బుధవారం కూడా బక్రీద్ సెలవు కలిసి రావడం... రేపు శుక్రవారం విడుదల కాబోయే సినిమాలకు భారీ హైప్ లేని కారణంగా గీత గోవిందం సినిమాకి మరింత కలిసొచ్చేలాగా కనబడుతుంది. చూద్దాం ఈ శుక్రవారం తర్వాత గోవిందుడి పరిస్థితి ఏమిటనేది?



from Telugu Unicode News feed from Cinejosh.com https://ift.tt/2BxzU3y

Yorum Gönder

0 Yorumlar